జ్ఞానవంతమైన సమాజాన్ని నిర్మించడమే స్వేరోస్ ప్రధాన లక్ష్యం

గిద్ద విజయ్ కుమార్ స్వేరో

ఈరోజు అచ్చంపేట కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ భవనంలో స్వేరోస్ నాయకుల సమావేశాన్ని అసెంబ్లీ ఇంచార్జ్ రెడ్డపాకుల శివశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కోకన్వీనర్ గిద్ద విజయ్ కుమార్ స్వేరో హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వేరోస్ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ స్వేరోస్ మండల కమిటీ అధ్యక్షులకు స్వేరోస్ నెట్వర్క్ ని దిశా నిర్దేశం చేస్తూ, అక్షరం ఆరోగ్యం ఆర్థికం ఆత్మగౌరం పైన ప్రతి గ్రామంలో విద్యార్థులకు, ప్రజలకు చైతన్య పరుస్తూ, నూతన కమిటీలను నిర్మిస్తూ రాష్ట్ర బూట్ క్యాంపు వరకు పూర్తిస్థాయిలో జ్ఞానవైపు నడిపించాలని విజ్ఞప్తి చేస్తూ అచ్చంపేట అసెంబ్లీలో జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాల కమిటీ ల నిర్మాణం తో పాటు మండల గ్రామంలో సమాజం మార్పు స్వేరోస్ నెట్వర్క్ దిశగా వెళ్లాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ సంపత్ కుమార్, అచ్చంపేట మండల అధ్యక్షులు వారణాసి మహేష్, లింగాల మండల అధ్యక్షులు శ్రీకాంత్, చారకొండ మండల అధ్యక్షుడు పాపయ్య, బల్మూరు మండల అధ్యక్షుడు బాబు, అమ్రాబాద్ మండల నాయకులు బరపాటి రంజిత్, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »