పడిశాల కుటుంబానికి ఆర్థిక సాయం: చల్లా కృష్ణ

జ్ఞాన తెలంగాణ,ఖమ్మం జిల్లా, ప్రతినిధి, ఆగస్టు 18:
ఖమ్మం జిల్లా దానవాయిగూడెం 59వ డివిజన్ దానవాయిగూడెం లో పడిశాల భార్గవి గారు ఇటీవల కాలంలో అకస్మాత్తుగా మరణించారు, విషయం తెలుసుకున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడు, తుంబురు దయాకర్ రెడ్డి సలహామేరకు,కాంగ్రెస్ పార్టీ నాయకులు చల్లా కృష్ణ మృతుల కుటుంబాని పరామర్శించి , వారి కుటుంబానికి మంచి మనస్సు లలో మనోదర్యాని నింపారు, ఈ రోజు దశదిన కార్యక్రమానికి, తమ వంతు సాయంగా మన చల్లా కృష్ణ 5,000/ రూపాయలు కుటుంబ సభ్యులకు అందజేశారు. వారికి ఎపుడూ, కాంగ్రెస్ పార్టీ తరుపున అందుబాటులో ఉంటామని వారికి ధైర్యాన్ని నింపారు, ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు పాల్గొన్నారు.