శబరిమల వరకు మహా పాదయాత్ర ప్రారంభo

జ్ఞాన తెలంగాణ బాన్సువాడ ప్రతినిధి అక్టోబర్ 24:
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన ఏడుగురు అయ్యప్ప మాల ధారణ చేసిన స్వాములు కేరళలోని శబరిమల వరకు మహా పాదయాత్రలో బయలుదేరారు. కొర్రి సుధాకర్ యాదవ్ గురుస్వామి, కొర్రి శివకుమార్ స్వామి, కొర్రి చంద్రశేఖర్ స్వామి, మేకల రాజు స్వామి, షాకిడి రమేష్ స్వామి, మానేపురం సాయికుమార్ స్వామి,ముత్యం గారి సుధాకర్ గౌడ్ స్వామి, ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు. నవంబర్ 29న శబరిమలై చేరుకొని అయ్యప్ప స్వామిని దర్శించుకోనున్నట్లు సుధాకర్ యాదవ్ గురుస్వామి తెలిపారు.

You may also like...

Translate »