రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలలో అద్భుతమైన ప్రతిభ కనబరిచినజాఫర్గడ్ ఆదర్శ కళాశాల విద్యార్థిని.
జ్ఞాన తెలంగాణ జఫర్ గఢ్: ఈనెల 3,4 వ తారీకున హనుమకొండ జిల్లా బాక్సింగ్ హాల్లో జరిగినటువంటి రాష్ట్రస్థాయి అండర్ 19 బాల బాలికల బాక్సింగ్ పోటీలలో జాఫర్ గాడ్ ఆదర్శ కళాశాల విద్యార్థిని కే కావ్య CEC-2 అద్భుతమైన ప్రతిభ కనబరి 49 వెయిట్ కేటగిరీలో రాష్ట్రస్థాయిలో సిల్వర్ మెడల్ (రెండవ స్థానం) పొందడం జరిగింది . అందులో భాగంగా జఫర్గడ్ ఆదర్శ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె శ్రీకాంత్ విద్యార్థినిని అభినందించి జాతీయస్థాయిలో కూడా రాణించాలని చెప్పడం జరిగింది. * ఈ విద్యార్థిని ఆదర్శ పాఠశాల జాఫర్గడ్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. శ్రీకాంత్ మరియు పీఈటీలు బి రాజు, ఏ శ్రీనాథ్ మరియు ఉపాధ్యాయ బృందం అభినందించారు.