రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టా రెడ్డి కలిసిన జె.యన్.టియు.జె.ఏ.సి రాష్ట్ర కార్యవర్గం

జె.యన్.టియు.జె.ఏ.సి రాష్ట్ర కార్యవర్గం
ఆచార్య బాలకిష్టా రెడ్డి గారిని వారికార్యాలయం లో కలసి అభినందనలు తెలియచేయడం జరిగింది. బాలకిష్టా రెడ్డి గారు మాట్లాడుతూ ప్రస్తుత సమాజ అవసరాలకు అనుగుణంగా సిలబస్ రూపాకల్పన దిశగా పక్క ప్రణాళిక రూపొందిస్తున్నాం అని గత పదేళ్లలో జరగని విప్లవత్మాక మార్పుకు అడుగులు పడుతున్నాయి అని మరియు గ్రామీణ ప్రాంత విశ్వవిద్యాలయాలకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వాటి అభివృద్ధికి చర్యలు చెపడుతున్నాం అని ప్రభుత్వం కుడా ఎంతో దృఢ సంకల్పం తో విద్యా అభివృద్ధి కి పాటుపడుతుంది అని తెలియచేసారు. బాలకిష్టా రెడ్డి గారిని కలిసిన వారిలో జె యన్ టీ యూ జె ఏ సి రాష్ట్ర నాయకులు బల్గర్ సందీప్, అంబటి తేజ, దాస్యం విక్రాంత్ మరియు ఆదిమల్ల పవన్ పాల్గొన్నారు.
