తెలంగాణ విద్యా విప్లవాన్ని నిర్వీర్యం చేసే కుట్రలపై ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం

– నేడు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం


తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ దూరదృష్టితో ప్రారంభించిన తెలంగాణ విద్యా విప్లవం రాష్ట్ర భవిష్యత్‌కు బలమైన మౌలికాధారంగా నిలిచిందని స్పష్టం చేశారు. గురుకుల విద్యా విస్తరణ, ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ, పేదబహుజన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించే దిశగా చేపట్టిన సంస్కరణలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాయని తెలిపారు.

అయితే, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మరియు తెలంగాణ విద్యా కమిషన్ సమన్వయంతో ఈ విద్యా విప్లవాన్ని నిర్వీర్యం చేసే కుట్రపూరిత చర్యలకు పాల్పడుతున్నట్లు బిఆర్ఎస్ నాయకులు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తీవ్రంగా ఆక్షేపించారు. బడ్జెట్ కోతలు, విధానాల అస్థిరత, అమలు లోపాలు మరియు సంస్థాగత బలహీనతల ద్వారా విద్యా వ్యవస్థను దెబ్బతీయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.

విద్యను రాజకీయ ప్రతీకార సాధనంగా మలచడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, ఇది భవిష్యత్ తరాలపై దుష్ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యా విప్లవాన్ని నాశనం చేయడానికి జరుగుతున్న కుట్రలు అనే అంశంపై నేడు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ భవన్‌లో నిర్వహించే మీడియా సమావేశంలో సమగ్ర ఆధారాలతో తన వాదనలను వెల్లడిస్తామని తెలిపారు.

You may also like...

Translate »