చేవెళ్లలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం


– రైతులకు మద్దతు ధర కల్పించేందుకే ఈ చర్య
– ఎమ్మెల్యే కాలే యాదయ్య


జ్ఞానతెలంగాణ,చేవెళ్ల, నవంబర్ 7:
రైతులు మార్కెట్‌లో నష్టపోకుండా, ప్రభుత్వ నిర్ణయించిన మద్దతు ధరకు పంటలు విక్రయించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య తెలిపారు. నవాబ్‌పేట్ మండలం వట్టిమీనపల్లి గ్రామ సమీపంలోని గోదాంలో మార్క్‌ఫెడ్ సౌజన్యంతో, PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కాలే యాదయ్య , “ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తోంది. పంటలకు సరైన మద్దతు ధర లభించక రైతులు నష్టపోకుండా, వారిని ఆర్థికంగా బలపరచడానికి ఈ కేంద్రాలను ప్రారంభించాం. ప్రతి రైతు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం” అన్నారు.
“రైతు కష్టం వ్యర్థం కాకుండా ఉండటమే మా ప్రధాన లక్ష్యం. పంట కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలి. మార్క్‌ఫెడ్, PACS ఆధ్వర్యంలో నేరుగా రైతుల నుంచి పంటలను కొనుగోలు చేయడం ద్వారా మధ్యవర్తుల దందాకు చెక్ వేయగలుగుతాం” అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైతులు ఎమ్మెల్యే గారిని కలిసి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

You may also like...

Translate »