బీసీ బంద్‌లో కవిత కొడుకు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వారసత్వ రాజకీయాల చర్చ మొదలైంది. కవిత తన వారసుడిని రాజకీయాల్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. తాజాగా బీసీ బంద్ సందర్భంగా కవిత కొడుకు ఆదిత్య పాల్గొనడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.ఇటీవల బీఆర్ఎస్ నుంచి దూరంగా ఉంటూ కొత్త రాజకీయ దిశలో అడుగులు వేస్తున్న కవిత ఈ క్రమంలో తన కొడుకును రాజకీయ రంగంలోకి పరిచయం చేయాలని చూస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆదిత్య బీసీ బంద్‌లో పాల్గొని నేతలతో చర్చించడం, కార్యకర్తలతో కలిసివుండడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.ఇక గతంలో కేటీఆర్ కొడుకు హిమాన్షు పబ్లిక్ ఈవెంట్లలో కనిపించడం కూడా గుర్తు చేసుకుంటున్నారు రాజకీయ వర్గాలు. ఇప్పుడు కవిత కొడుకు ఆదిత్య కూడా సజీవ రాజకీయాల్లోకి అడుగు పెట్టడం వల్ల, భవిష్యత్తులో కెసిఆర్ మనవళ్లు తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించవచ్చని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
