సీసీ కెమెరాల నిఘా లో ఇంటర్ ప్రాక్టికల్స్ … ఆందోళనలో ప్రైవేట్ విద్య సంస్థలు

ఆందోళనలో ప్రైవేట్ విద్య సంస్థలు


సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఇంటర్ ప్రాక్టికల్స్
– అవకతవకలు అరికట్టేందుకు ఏర్పాట్లు
– 900 ల్యాబుల్లో ప్రాక్టికల్స్ నిర్వహణ


తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ప్రయోగ పరీ క్షలను సీసీ కెమెరాల నిఘా నీడలో నిర్వహించా లని భావిస్తోంది. మాల్ ప్రాక్టీస్లను నిరోధించడానికి సీసీ కెమెరాలను .. 900 ల్యాబ్ లో ఏర్పాటు చేస్తున్నట్టు ఇంటర్ బోర్డు అధికారులు ప్రకటిం చారు. అన్ని కార్పొరేట్ జూనియర్ కళాశాలల విద్యార్థులకు ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ను పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు ప్రాక్టికల్స్ ను స్వతంత్రంగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో కఠిన మైన నిబంధనలు అమలు చేసేందుకు ఇంటర్ బోర్డు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే వివిధ కాలేజీల్లో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు సాధారణ, వృత్తి విద్యా కోర్సులకు ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహి స్తారు. ఇది ఇలా ఉంటే.. ఇంటర్ ఫస్ట్, సెకెండ్ ఈయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 31, ఫిబ్రవరి ఒకటిన చేపడతారు. బ్యాక్ లాగ్ విద్యార్థులకు జనవరి 29న, జనవరి 30న ప్రయోగ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్ థియరీ పరీక్షలు నిర్వహిస్తారు.


గత కొంతకాలంగా ఇష్టానుసారంగా ప్రాక్టికల్స్ మార్కులు వేస్తూ మోసం చేస్తున్న విద్యా సంస్థలకు చెక్ పడనుంది..
విద్యార్థుల స్కోర్ చేసుకోవడానికి ప్రాక్టికల్స్ చాలా గొప్ప అవకాశం..
ఇది అదునుగా ప్రైవేట్ విద్యా సంస్థలు ఇష్టానుసారంగా మార్కులు వేసి తమ కళాశాల అడ్మిషన్లు పెంచుకోవడానికి నిరంతరం కృషి చేస్తూనే..
ఇంటర్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంతో ఒక్కసారిగా వాళ్ళ ఆలోచనలు తలకిందులు అవుతయాని విశ్లేషకులు చెబుతున్నారు

You may also like...

Translate »