జిఒ 317 ను సవరించి బాధితులకు న్యాయం చేయాలి

తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్. TRTF రంగారెడ్డి జిల్లా
- GO 317 కు సంబంధించి స్పౌజ్ మ్యూచువల్ మెడికల్ బదిలీలకు మాత్రమే అనుమతి
- ఈ మాత్రానికి సబ్ కమిటీ ఎందుకు?
- జిఒ 317 ను సవరించి బాధితులకు న్యాయం చేయాలి
జిఒ 317 లోని అసంబద్ధమైన నిబంధనల కారణంగా పలువురికి నష్టం వాటిల్లిందని, వాటిని సవరించి వారికి న్యాయం చేయాలని గత మూడేళ్ళుగా పోరాడుతున్న సందర్భంలో బాధితులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. సబ్ కమిటీ ఆరు నెలలపాటు శోధించి సాధించింది ఏమిటంటే గత ప్రభుత్వం చేసిన పనిని ఆమోదించటం మినహా ఏమీ చేయలేకపోయింది. దంపతుల బదిలీలు గత ప్రభుత్వంలో 19 జిల్లాల్లో పూర్తిగా, 13 జిల్లాల్లో స్కూలు అసిస్టెంట్ స్థాయి వరకు బదిలీలు నిర్వహించారు.
స్థానికత కోల్పోయిన వారి బదిలీల విషయం ప్రస్తావనే లేదు :
అధికారంలోకి వచ్చిన 48 గంటలలో 317 అంశాన్ని పరిష్కరిస్తామని మాట ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారు తన మాట నిలబెట్టుకోవాలి స్థానికత కోల్పోయిన ప్రతి ఒక్క 317 బాధితునికి వారి స్థానికత కల్పిస్తూ వెంటనే బదిలీలు జరపాలి అని TRTF రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొమ్మ లోకేశ్వర్ మరియు ప్రధాన కార్యదర్శి జామ కుషాల్ పక్షాన కోరుచున్నాము