సావిత్రి భాయి పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

సావిత్రి భాయి పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
MJPT మియాపూర్ చేవెళ్ల పాఠశాల పాల్గొన్న చేవెళ్ల సర్పంచ్ బండారి శైలజ ఆగి రెడ్డి
మహిళలకు విద్యాబుద్దులు నేర్పి వారిలో చైతన్యం కల్పించిన మొట్ట మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని, ఆమె ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు కృషి చేయాలని చేవెళ్ల సర్పంచ్ బండారి శైలజాఆగిరెడ్డి అన్నారు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా బుధవారం చేవెళ్లలోని సావిత్రిబాయి పూలే గురుకుల పాఠశాలలో చిత్రపటానికి పూలమాలలు వేసి విద్యార్థులతో జయంతి వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా చేవెళ్ల సర్పంచ్ బండారి శైలజ ఆగిరెడ్డి మాట్లాడుతూ…దేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక విప్లవకారిణి సావిత్రాబాయి ఫూలే అని అన్నారు.సావిత్రిభాయి పూలే తన జీవితాన్ని మహిళల హక్కులకోసం, బాలికల విద్యకోసం, సామాజిక దురాచారాలను రూపుమాపడంకోసం అంకితంచేసిందని కొనియాడారు. సావిత్రి భాయి పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల స్పెషల్ ఆఫీసర్ నరసింహ, సీనియర్ ఉపాధ్యాయురాలు శ్రీమతి హేమలత మేడం, సంతోషి మేడం,సుమిత్ర, జగదీష్,పీటర్, తదితరులు పాల్గొన్నారు.