పదవులు మారినా… స్నేహం మారదు

- డప్పు యాదయ్య–కాలే యాదయ్య మైత్రికి నిదర్శనం
- రాజకీయాల కన్నా- చిరకాల స్నేహం మిన్న.. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య….
జ్ఞాన తెలంగాణ, సంగారెడ్డి, కొండాపూర్, నవంబర్ 16 :
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం ముని దేవుని పల్లి గ్రామానికి చెందిన డప్పు యాదయ్య కూతురి వివాహానికి చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య హాజరై ఆనందం వ్యక్తం చేశారు.
20 ఏళ్ల క్రితం జిల్లాలు వేరు అయినా ఒకేసారి ఎంపీపీగా ఎన్నికైన డప్పు యాదయ్య – కాలే యాదయ్యల చిలకాల స్నేహం
ఆత్మీయ మిత్రుడి కుమార్తె వివాహ వేడుకకు విచ్చేసి ఆశీర్వాదాలు అందించిన చేవెళ్ళ ఎమ్మెల్యే యాదయ్య
రాజకీయ హోదా మారినా స్నేహం మాత్రం అలాగే
ఇరవై సంవత్సరాల క్రితం వేరే జిల్లా అయినా ఒకేసారి ఎంపీపీగా ఎన్నికై ప్రజాసేవలో ముద్రవేసిన చిలకాల మిత్రులు, కొండాపూర్ మాజీ ఎంపీపీ డప్పు యాదయ్య – చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యల మధ్య సాగుతున్న స్నేహబంధం మరోసారి వెలుగులోకి వచ్చింది. తమ ఆత్మీయ మిత్రుడి కుటుంబ సంతోషానికి భాగస్వామ్యమవుతూ చేవెళ్ళ ఎమ్మెల్యే యాదయ్య హాజరై డప్పు యాదయ్య కూతురు వివాహానికి ఆశీర్వాదాలు అందించారు.
వివాహ వేడుకలో ఎమ్మెల్యేను గౌరవపూర్వకంగా స్వాగతించిన మిత్రుడు యాదయ్య “పదవులు మారినా, బాధ్యతలు మారినా – స్నేహం మాత్రం మారకుండా కొనసాగుతున్న గొప్ప ఉదాహరణ ఇదే” అని ఆనందం వ్యక్తం చేశారు. నాయకుల అనుబంధాన్ని ప్రశంసిస్తూ, “ఇలాంటి స్నేహం రాజకీయాలకు మించి మనిషితనాన్ని చాటుతుంది” అని అభిప్రాయపడ్డారు.
కార్యక్రమంలో మల్కాపూర్ యువ నాయకుడు డప్పు అనంతయ్య, పట్నం రాజు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, బంధువులు పాల్గొన్నారు.
