రైతులకు అంకితమైన సేవ – నా లక్ష్యం

రైతులకు అంకితమైన సేవ – నా లక్ష్యం
- రైతుల కోసం శ్రమిస్తాను: ఏఎంసి డైరెక్టర్ మహమ్మద్ సర్తాజ్
- వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా
జ్ఞాన తెలంగాణ ప్రతినిధి,శంకర్పల్లి :
“రైతులకు సేవ చేసే భాగ్యం కలగడం నా అదృష్టం” అని శంకర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన డైరెక్టర్ మహమ్మద్ సర్తాజ్ అన్నారు. బాధ్యతగా పని చేసి రైతులకు మేలు చేసేందుకు పాటుపడతానని స్పష్టం చేశారు.వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చిన ఆయన, రైతులు మద్దతు ధర పొందేలా, మార్కెట్లో సౌకర్యాలు మెరుగుపడేలా ప్రత్యేక దృష్టి పెడతానని తెలిపారు. రైతుల సంక్షేమమే నా ప్రథమ కర్తవ్యం అంటూ హామీ ఇచ్చారు.రెండోసారి డైరెక్టర్ పదవి లభించినందుకు చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్యకు కృతజ్ఞతలు తెలిపిన మహమ్మద్ సర్తాజ్, ఈ విశ్వాసాన్ని న్యాయంగా నిలబెట్టుకునేందుకు అన్ని విధాలుగా శ్రమిస్తానని తెలిపారు. రైతుల అండదండలతో మరింత సేవచేయాలని కోరుకుంటున్నానని అన్నారు.
