హెడ్మాస్టర్ రాములు గారిని పరామర్శించిన సిఐటి యూ ప్రజాసంఘాలు

అయ్యప్ప స్వాముల ముసుగులో బిజెపి వాళ్లు దాడిచేసిన దళితుడైన హెడ్మాస్టర్ రాములు గారిని సిఐటి యూ ప్రజాసంఘాలు పరామర్శ
జ్ఞానతెలంగాణ, రంగారెడ్డి :
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో పనిచేస్తున్న హెడ్మాస్టర్ రాములు పై మతోన్మాదుల దాడిని నిరసిస్తూ ఈరోజు ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులని, ఆయనని పరామర్శించడం జరిగింది. అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థిని నిలబెట్టాడని, కాలు తో తన్నాడని అబండలు వేస్తూ దళితుడైన రాములు సార్ పై దాడి చేసిన వాళ్ళు ప్రధానంగా ప్రజాప్రతినిధులు బిజెపి నాయకులు ఆర్ఎస్ఎస్ వాళ్లు. అయ్యప్ప స్వాములు ముసుగులో వచ్చి దాడి చేశారు. కొట్టి గాయ పరిచి బట్టలు చించేసి ఆ తర్వాత వేరే ఒక స్వీపర్ టీ షర్టు వేయించి విద్యార్థి కాళ్ళు మొక్కించుకున్నారు. ఈ దుర్మార్గమైన చర్యను ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి అందరిని జైలుకు పంపాలని సిఐటియు తరఫున డిమాండ్ చేయడం జరిగింది. సిఐటి యూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ సిఐటీ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం చంద్రమోహన్, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ కన్వీనర్ కవిత, సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రామచందర్, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు స్వప్న సిఐటియు జిల్లా నాయకులు పెంటన్న, బాలరాజు, పోచమోని కృష్ణ,బాలాపూర్ శేఖర్, మహేశ్వరం శేఖర్ తదితరులు పాల్గొన్నారు.


