స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీ జేఏసీ పోటీ

- అతి త్వరలో బీసీ పార్టీ
- బీసీలకు పార్టీ గుర్తు కూడా వస్తుంది
- రేవంత్ రెడ్డి ఇచ్చే 42 శాతం బీసీ రిజర్వేషన్ మోచేతి మీద బెల్లం పెట్టినట్లు ఉందని ఎద్దేవా
- కిరాయి పార్టీల్లో పని చేయొద్దని సందేశం
- సొంత పార్టీ తో సత్తా చాటుదామని పిలుపు
- తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ
జ్ఞాన తెలంగాణ,జహీరాబాద్ప్ర,తినిధి జులై 12 :
జరసంఘం మండల కేంద్రంలో ఆర్యవైశ్య భవన్ లో బీసీ జేఏసీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తీన్మార్ మల్లన్న టీం సభ్యుడు నరసింహ తెలిపారు ఈ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ హాజరయ్యారు వారు మాట్లాడుతూ ఇప్పుడున్న పార్టీలు కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్ పార్టీలు ఎప్పటికైనా కిరాయి ఇంటిలాంటి అని కాబట్టి మనం అతి త్వరలో బీసీ పార్టీ గుర్తుతో త్వరలో రావడం జరుగుతుంది అని అన్నారు ప్రతి ఒక్కరు స్థానిక ఎన్నికల్లో బీసీ అభ్యర్థి ఎన్నికల్లో పోటీలో ఉన్నప్పుడు కచ్చితంగా బీసీ మన అభ్యర్థికి మనం కచ్చితంగా ఓటేసి గెలిపించవలసిన బాధ్యత మనందరి పైన ఉందని వారు అన్నారు
ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు మోచేతి మీద బెల్లం పెట్టినట్లు ఉందని అగ్రకులాల పార్టీల మనల్ని మోసం చేసే ప్రక్రియ చేస్తారు కాబట్టి మనం 2028లో కచ్చితంగా మన రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలమంత కలిసి బీసీ ముఖ్యమంత్రి కచ్చితంగా ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ రాష్ట్ర ,జిల్లా నియోజకవర్గ మండల నాయకులు పాల్గొన్నారు

