పార్లమెంట్ లో 141 మంది ఎంపీల సస్పెన్షన్ దేశ వ్యాప్తంగా ధర్నాకు విపక్షాలు ప్లాన్.

పార్లమెంట్ లో 141 మంది ఎంపీల సస్పెన్షన్ దేశ వ్యాప్తంగా ధర్నాకు విపక్షాలు ప్లాన్.
న్యూఢిల్లీ:పార్లమెంట్‌లో విపక్ష పార్టీలకు చెందిన 141 మంది ఎంపీలను సస్పెన్షన్ చేసిన వ్యవహారం కుదిపేస్తుంది పార్లమెంట్ నుంచి రికార్డు స్థాయిలో ఎంపీల సస్పెన్షన్ చేయడంతో కేంద్ర ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.మొత్తం 141 మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్ సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది ఎంపీల సస్పెన్షన్, ఇతర అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది.లోక్‌సభ నుంచి 95 మంది, రాజ్యసభ నుంచి 46 మంది ఎంపీలు సహా మొత్తం 141 మంది ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు ఎంపీల సస్పెన్షన్ నేపథ్యంలో సస్పెండ్ అయిన ఎంపీలకు పార్లమెంట్ ఛాంబర్ లాబీ గ్యాలరీల్లోకి రాకుండా లోక్‌సభ సెక్రటేరియట్ సర్క్యులర్ జారీ చేశారు.