బొడ్రాయి స్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే

బొడ్రాయి స్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే

ఙ్ఞాన తెలంగాణ, దామరగిద్ద ఏప్రిల్ 9:

నారాయణపేట మండలం అంత్వర్ గ్రామంలో గ్రామస్థుల బొడ్రాయి స్థాపన కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి గారినీ గ్రామస్తులు స్వాగతించారు. నాభిశిలకు ప్రత్యేక పూజలు నిర్వహించి స్థాపించారు. అలాగె ఉగాది పండుగ సందర్భంగా గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద బ్రాహ్మణులు ఎమ్మెల్యేను సన్మానించిఆశీర్వదించారు. గ్రామ పెద్దలు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దామర గిద్ధ కాంగ్రెస్ పార్టీ యూత్ కార్యదర్శి శరత్ చంద్ర,నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

You may also like...

Translate »