ఐక్యత ప్రెస్ క్లబ్ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జారే

ఐక్యత ప్రెస్ క్లబ్ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జారే
జ్ఞాన తెలంగాణ భద్రాద్రి/అశ్వారావుపేట:తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా ఐక్యత ప్రెస్ క్లబ్ నూతన క్యాలెండర్ ను అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగిoది. ఈ కార్యక్రమానికి ఐక్యత ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులు జుజ్జారపు రాంబాబు, ప్రధాన కార్యదర్శి కూన చెన్నారావు ,గౌరవ అధ్యక్షుడు గాలి రాఘవేంద్ర ,కోశాధికారి నార్లపాటి సోమేశ్వరరావు ,ఉపాధ్యక్షుడు దాది చంటి, సహాయ కార్యదర్శి నార్లపాటి సుబ్బారావు, కార్యవర్గ సభ్యులు సిహెచ్ నాగు, గోళ్ళ నవీన్, కుర్సం రవి, శివ శంకర్, కూన దుర్గారావు , బ్రహ్మ రావు తదితరులు పాల్గొన్నారు.