బీఎస్పీ సెంట్రల్ కో ఆర్డినేటర్ రామ్ జీ గౌతమ్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ రిజర్వేషన్ ల వ్యతిరేకి అని బీఎస్పీ సెంట్రల్ కో ఆర్డినేటర్ రాజ్య సభ సభ్యులు రాంజీ గౌతమ్ తీవ్రంగా విమర్శించారు. ఈ రోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యకర్తల సమావేశం లో ముఖ్య అతిథి గా పాల్గొని ప్రసంగించారు. స్వాతత్య్రం వచ్చిన నుండి రాజ్యాంగం అమలు అయిన నుండి బీసీ రిజర్వేషన్ లు అమలు చేయలేదన్నారు నలబై మూడు సంవత్సరాల పాటు బీసీ లు అన్ని రంగాల్లో వారి వాటా ను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా పర్యటన లో ఈ దేశం లో అధికారం లోకి వస్తే రిజర్వేషన్ లు తొలగిస్తామని మాట్లాడిన తీరును తీవ్రంగా తప్పు పట్టారు. బేజేపీ, కాంగ్రెస్ లు రెండూ పార్టీ లు రాజ్యాంగం ను రద్దు చేయాలను కుట్ర చేస్తున్నాయని అన్నారు. ఈ దేశం లో కుల గణన వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. దేశం లో ఎస్సీ వర్గీకరణ ద్వారా ఎస్సీ లను విడదీయాలనీ బీజేపీ కుట్ర చేస్తుందని అన్నారు. దేశం లో ఎస్సీ లను విభజించి పాలించు అనే కుట్ర తో బీజేపీ ఆలోచిస్తుందని అన్నారు. దేశం లో రాష్ట్రము లో మహిళ లపై మానభంగాలు జరుగుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూసి చూడనట్లు వ్యవహారిస్తున్నాయి అని అన్నారు దళిత ప్రజల పై అమానుషమైన దాడులకు కాంగ్రెస్ బీజేపీ లే కారణమన్నారు. మాయావతి గారు దేశం లో బహుజన సమాజం కోసం కొట్లాడే ఒకే ఒక్క నాయకురాలు అని అన్నారు. మాయావతి గారు ప్రధాని అయితే నే బహుజనుల బ్రతుకులు బాగుపడతాయాన్ని అన్నారు. తెలంగాణా ఆంధ్రప్రదేశ్ లలో పార్టీ ని బూత్ స్తాయి వరకు నిర్మించి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి రానున్న శాసన సభ ఎన్నికల్లో అధికారం లోకి రావాలని క్యాడర్ కి హిత బోధ చేశారు. ఈ సమావేశం లో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ సభద్యక్షత వహించగా ఆంధ్రప్రదేశ్ కో ఆర్డినేటర్ పూర్ణ చందర్ రావు, బాలన్న, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పరం జ్యోతి, తెలంగాణా ఉపాధ్యక్షులు శ్రీ రామ్ కృష్ణ, ప్రధాన కార్యదర్శి లు ఇబ్రమ్ శేఖర్, బోడపట్ల ఈశ్వర్, అడ్వకేట్ నిషాని రామచంద్రం, గుండెల ధర్మేందర్, మేడి ప్రియదర్శిని, అనిత రెడ్డి, బోయిని చంద్ర శేఖర్ ముదిరాజ్ అంకని భాను, ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి వందన్ కుమార్, ఉపాధ్యక్షులు గౌతమ్ బందెల, ప్రధాన కార్యదర్శి మల్లికల్, నాయిని ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు