మహానీయుల జయంతి వేడుకలు గ్రామాల్లో ఘనంగా నిర్వహించాలి.

మహానీయుల జయంతి వేడుకలు గ్రామాల్లో ఘనంగా నిర్వహించాలి.

  • రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య

జ్ఞానతెలంగాణ, చిట్యాల,ఏప్రిల్ 09:

జయశంకర్ భూపాలపల్లి చిట్యాల మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన సమావేశం లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా ,మండల ,గ్రామాల్లో బడుగు బలహీన వర్గాలైన ఎస్ సి ,ఎస్ టి, బి.సి,మైనార్టీ కులాలకు చెందిన ప్రజల చీకటి జీవితాల్లో వెలుగులు నింపిన మహానీయులు మహాత్మా జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ లు అని ఆ మహానీయుల జయంతులు ఈ నెల 11న జ్యోతిరావు పూలే, 14న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గార్ల జయంతి వేడుకలు గ్రామాల్లో ఘనంగా నిర్వహించాలని తెలంగాణా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య అన్నారు.
మంగళవారం రోజున చిట్యాల మండల కేంద్రంలో జిల్లా ప్రచార కార్యాదర్శి గుర్రపు రాజేందర్ తో కలిసి ఆయన మాట్లాడుతూ మనకు స్వాతంత్ర్యం రాక ముందు ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని , అంటరానితనం మూఢనమ్మకాలు అస్పృశ్యతా కులవ్యవస్థ అణిచివేతలు బాణిసత్వం అవమానాలు అధికంగా ఉండేదని తెలిపారు. వాటి నుండి విముక్తి చేయడమే కాకుండా ప్రజల చీకటి జీవితాల్లో వెలుగులు నింపిన మహానీయులు ఉన్నారని తెలిపారు.అందులో ఈ నెల 11న మహాత్మా జ్యోతిరావు పూలే, 14న బాబా సాహెబ్ అంబేద్కర్ ల జయంతి వేడుకలు గ్రామగ్రామాన ఘనంగా నిర్వహించాలని మరియు వారి ఆశయాలను సిద్ధాంతాలు ముందుకు తీసుకెళ్లాలని కోరారు.

You may also like...

Translate »