చదువుకున్నవారిలో కూడా మూఢనమ్మకాలెందుకున్నాయి?


చదువుకున్నవారిలో కూడా మూఢనమ్మకాలెందుకున్నాయి?


సాధారణంగా ప్రజలు, “చదువుకున్నవారిలో జ్ఞానం ఉంటుంది వారు ఏది చేసినా, ఏది మాట్లాడినా నిజమే ఉంటుంది. వారికి అన్నీ తెలుసు వారిని ఆదర్శంగా తీసుకుంటే సరిపోతుంది” అనే భావనలో ఉంటారు. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. కొందరిలో చదువుకున్న కొందరిలో జ్ఞానంతో విజ్ఞానాభివృద్ధి చెంది, హేతువాద దృక్పథంతో మంచి ఏదో చెడు ఏదో గ్రహించి మంచిని ఆచరిస్తూ ఇతరులకు మార్గదర్శకంగా ఉంటారు. వారు ఏది మాట్లాడినా, ఏది చేసినా అందులో జ్ఞానమే కనిపిస్తుంది. కొందరు బాగానే చదువుతారు విద్యావంతులుగా
పేరు గడిస్తారు.ఉన్నతోద్యోగాలు చేస్తుంటారు.

సైన్స్ ఆధారిత సంస్థల్లో పని చేస్తుంటారు. కానీ వారిలో విజ్ఞానం కనిపించదు మతాలను నమ్ముతారు మతవాదిగా ఉంటారు దేవుడిని నమ్ముతారు మత అలంకరణలు చేసుకుంటారు. భజనలు చేస్తారు కీర్తనలు పాడుతారు. యాత్రలు చేస్తారు జాతరలు పోతారు. పుష్కరాలలో మునుగుతారు. అలా ఎందుకు ప్రవర్తిస్తారు అంటే వారు చిన్నప్పుడు బామ్మ,తాతయ్య,తల్లిదండ్రులు,
చెప్పిన వాటిని నిజమనుకొని ఆలోచించకుండా దాని గురించి ప్రయోగ పరిశీలన జరపకుండా గుడ్డిగా నమ్ముతుంటారు.

వారు సైన్స్ చదువుకున్నను సైన్స్ యందు నమ్మకము విశ్వాసము లేక “సర్వం జగన్నాథం”అంతా దైవ లీల, దైవమాయ, అని మూర్ఖంగా నమ్ముతుంటారు.

ఎన్ని పుస్తకాలు తిరిగేసినను ఎంత పుస్తక జ్ఞానం సంపాదించినను వారి బుర్రలో మత మౌౌడ్యం, మత మూర్ఖత్వం దైవభావన నిండి ఉంటుంది. కొందరు ప్రజలు ఇటువంటి వారిని కూడా అనుసరిస్తారు. అనుసరించిన ప్రజలకు మత భావన మూర్ఖత్వం నిండి ఉంటుంది.

చదువురాని వారిలో కన్నా చదువుకున్న వారిలో కూడా మూడత్వం,మూఢనమ్మకాలు ఉండడం వల్ల
ప్రజలు అవే నిజమనుకొని ఆచరిస్తుంటారు. రాజకీయ నాయకులు , ధనవంతులు
దైవదర్శనాలు చేసుకోవడం, గుళ్ళు గోపురాలు కట్టడానికి చండాలివ్వడం, రాతి విగ్రహాలకు ఆభరణాలు చేయించడం, ఉత్సవాలు నిర్వహించడం ఇవన్నీ చూసిన ప్రజలు కూడా వారిని అనుసరిస్తుంటారు. అందువలననే మన దేశం ఇలా తగలబడిపోతుంది. మతాలు రాజ్యమేలుతున్నాయి మూర్ఖత్వం ప్రజా పాలన చేస్తుంది. ప్రజల మీద వేసిన పన్నుల ధనమంతా ఇలా వ్యర్థమైన వాటికి అనవసరమైన వాటికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం వల్ల ప్రజల సమస్యలు అలాగే ఉండిపోతున్నది. “ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోతుందన్నట్టు”గా ప్రజల పేదరికం ఇంకా పెరుగుతుందే కానీ తరగడం లేదు.

బాగా చదువుకున్న సైంటిస్టు బాబా కాళ్ళకు మొక్కుతున్నారు. కనుక ఏదో మహత్తు వుందన్నమాట అని “సాధారణ ప్రజలు” అనుకోవడం చూస్తున్నాం.

సాంకేతిక నిపుణులు, పవిత్ర(పనికిరాని మత గ్రంధాలు) గ్రంథాలను పట్టుకొని, పూజలు చేస్తున్నారు. ప్రొఫెసర్లు, అధ్యాపకులు ఉపాధ్యాయులు స్వాములు బాబాలు ఏం చెప్పినా, ప్రతి ఇంటిలో విగ్రహారాధన, బయట మొక్కుబడులు తీర్చుకుంటున్నారు.
ఈ విధంగా చదువుకున్నవారు మూఢనమ్మకాలను పాటిస్తుండటం వలన ప్రజలలో యింకా వాటికి బలం పెరుగుతోంది.

.

రాజకీయవాదులు, సినిమాతారలు, జడ్జీలు, లాయర్లు దీక్షలు బూనడం, పోలిస్ అధికారులు, తిరుపతి, షిర్డి, అయ్యప్ప భక్తులుగా, బాబా కాళ్ళ మీద పడుతూ చెవులు మెలివేసుకుంటూ భక్తి భావన ప్రవర్తించడంతో అదంతా ఆనవాయితీగా ప్రశ్నించరాని తీరుగా మారుతోంది

చదువుకున్నవారు మూఢవిశ్వాసాలతో వుండడం మన సమాజానికే పరిమితం కాదు. అగ్రరాజ్యమైన అమెరికా మొదలు కమ్యూనిష్టు దేశాలవరకూ
యీ మూఢత్వం వివిధ రూపాలలో వ్యాపించి అంటురోగం వలె స్వైర విహారం చేస్తున్నది.

మనకు లాభం కలిగే లాభం కలిగే,
అనుకూలమైన విషయంలో…
మనకు మనకు కలిసి వచ్చేచోట,
శాస్త్రీయ దృక్పథాన్ని పక్కనబెట్టి, అర మరికలు లేకుండా మూఢనమ్మకాన్ని పాటిస్తున్నారు. వారికి అవసరం లేని చోట కొన్ని విషయాలను మూఢనమ్మకాలని కొట్టిపారేస్తున్నారు. ఇది “గోడమీది పిల్లి వాటంగా” అనుకోవచ్చు. ఇలాంటివారు మహాప్రమాదకరం.
వేదికలెక్కి మూఢనమ్మకాలను ఖండించే వారే, యిలా అవకాశవాదులుగా మారడంతో ప్రజలలో విశ్వాసం సన్నగిల్లుతున్నది.

చదువుకున్నవారు ఇప్పటికైనా మారండి. మూఢ నమ్మకాలను, మూఢచారాలను మీరు నమ్మడం వలన మిమ్మల్ని పరిశీలించి అక్షరాజ్ఞానం లేని వారు కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు మీరు మారితేనే సమాజం మారుతుంది……….


-అడియాల శంకర్

అధ్యక్షులు,తెలంగాణ హేతువాద సంఘం



You may also like...

Translate »