ధమ్మ మార్గంలో ధన్యుడైన ఉపాలి

ధమ్మ మార్గంలో ధన్యుడైన ఉపాలి

శాక్య వంశానికి చెందిన యువరాజులు,అనిరుద్ధుడు, భిద్ధయుడు, ఆనందుడు, కింబిళుడు మరియు దేవదత్తుడు ,వీళ్లు ఐదుగురు బుద్ధుని శిష్యరికం స్వీకరించదలచి వారి ఆస్ధాన క్షురకుడైన ” ఉపాలి” ని వెంటబెట్టుకొని అడవుల వెంట బయలుదేరారు. రాజ్య సరిహద్ధు దాటిన తరువాత, తమ వద్ద ఉన్న ధనం, వంటిమీద ఉన్న వజ్రాభరణాలన్నీ మూటకట్టి ఉపాలికి బహుమతిగా ఇచ్చి జీవితమంతా ఆ డబ్బుతో ఆనందం గా బ్రతుకమని చెప్పారు.

ఉపాలి సందేహంతో “అయ్యా! ధనం లేకుండా మీరెక్కడికి వెళుతున్నారు? ఎలా బ్రతుకు తారు ? అని ప్రశ్నించాడు.

“మేము వెళ్లే చోటు ధనంతో పని లేని అద్భుతమైనది ” అని పలికి వెళ్లిపోయారు.ఉపాలి తన దగ్గర ఉన్న ఆభరణాలు డబ్బు తీసుకొని ఆనందంగా వెనుతిరిగి వెళుతున్నాడు.మార్గ మధ్యలో అతనికి సందేహమొచ్చింది, ధనంతో పని లేనిది అద్భుతమైనది అంటే ఆ జీవితమే మంచిది కదా! ఇవి నాకెందుకు? అనుకొని మూటను పొదలలో విసరి వేసి మరళా వారి వెనుక పరుగెత్తుకొనివెళ్లాడు.

అయ్యా! నేను కూడ ఆ అద్భుతమైన జీవితం లోని ఆనందం అనుభవించాలని ఉంది! దయ ఉంచి నన్ను కూడ తీసుకొని వెళ్లండి! అని వెంట బడ్డాడు.ఆశ్రమం చేరిన వీరిని చూసి బుద్ధుడు ముందుగా “ఉపాలి” కి శిష్యుని గా ఉపదేశించి తరువాత యువరాజులను స్వీకరించాడు.

బుద్ధుని తరువాతి కాలంలో “ఉపాలి” గొప్ప బౌద్ధ గురువు గా ప్రసిద్ధి చెంది మానవాళికి ఎంతో సేవ చేసాడు. యువరాజులే ఆయన దగ్గర ఎంతో జ్ఞాన బోధను పొందారు.’వినయ పీఠిక’ను బుద్ధుడి శిష్యుడైన ఉపాలి సంకలనం చేశాడు.ఈ గ్రంథంలో బుద్ధుడి సంఘ నియమ నిబంధనలను వివరిస్తుంది.ఈ పీఠికలో నాలుగు భాగాలు ఉన్నాయి. క్రమశిక్షణ, నియమాలను ఉల్లంఘించడం వల్ల కలిగే పరిణామాలను ఈ పీఠికలో వివరించారు.

కుల వివక్షత, కక్షలతో సమాజాన్ని కలుషితం చేస్తున్న వాళ్లు ఇటువంటి విషయాలు తెలుసుకుంటే కొంతైనా జ్ఞానోదయం అవుతుంది!

భవతు సబ్బ మంగలమ్

  • అరియ నాగసేన బోధి,M.A.,M.Phil.,TPT.,LL.బి,ధమ్మ గురువు & న్యాయవాది

You may also like...

Translate »