స్వరాష్ట్ర సాధనతోనే కొత్త మండలాలకు ఊపిరి.

బోధన్ నియోజకవర్గంలోని సాలూర మండలం తాసిల్దార్ కార్యాలయం.
జ్ఞాన తెలంగాణ – బోధన్
తెలంగాణ రాష్ట్రం సిద్ధించి పది సంవత్సరాలు పూర్తయిన కాలంలో స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాతనే గత బిఆర్ఎస్ ప్రభుత్వం కొత్త మండలాలను,కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. దాంతో ప్రజలకు ప్రభుత్వ పాలన మరింత చేరువైనట్లు అయింది.

నిజామాబాద్ జిల్లాలో బోధన్ నియోజకవర్గంలోని సాలురా, కోటగిరి మండలంలోని పోతంగల్, ఆర్మూర్ మండలంలోని ఆలూరు, నందిపేట మండలంలోని డొంకేశ్వర్ ఈ మేజర్ గ్రామపంచాయతీలు మండలాలుగా రూపుదిద్దుకున్నాయి. నూతన మండలంలో తాసిల్దార్ కార్యాలయాలను ఏర్పాటు చేయడంతో ప్రజలకు భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు, ఏళ్ల తరబడి వివాదాలుగా ఉన్న భూ సమస్యలు పరిష్కరించారు.

దాంతో స్వరాష్ట్రంలోని సుదీర్ఘంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలు పరిష్కారం చేయబడటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే బోధన్ నియోజకవర్గంలో నూతన చెక్ డ్యాంలు ఏర్పాటు చేయడంతో భూగర్భ జలాలు పెరిగి రైతులు రెండు పంటలు పండించుకునే స్థాయికి ఎదిగారు. అలాగే గత చరిత్ర వైభవం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమం తీరును గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు కళ్ళకు కట్టినట్లు అమరుల త్యాగాలను కళారూపాలలో ప్రదర్శించడంతో తెలంగాణ ఔనత్యం జిల్లా ప్రజలకు మరింత తెలిసి వచ్చింది.

తెలంగాణ రాష్ట్ర సాధనలో జరిగిన ఉద్యమంలో నిజామాబాద్ జిల్లా నుండి ఎందరో భాగస్వామ్యం అయ్యారు. బోధన్ పట్టణంలో 1621 రోజు జరిగిన రిలే దీక్షలు చరిత్రలో నిలిచిపోయాయి .అలాగే బోధన్ పట్టణంలో అమరవీరుల స్తూపం, తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి గుర్తుగా నిలిచిపోయాయి. నూతన మండలాల ఏర్పాటుతోపాటు తాండాలు, చిన్నచిన్న గ్రామాలు గ్రామపంచాయతీలుగా ఏర్పడడంతో ఆయా స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

తమ గ్రామాలలో ఎన్నికలు జరిగి కొత్త పాలకవర్గం ఏర్పడడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తెలంగాణ రాష్ట్రం సిద్ధించి పది సంవత్సరాలు జూన్ రెండు నాటికి పూర్తి కావడంతో ఆనాటి గుర్తులను నెమరు వేసుకుంటున్నారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలలో అందరూ భాగస్వాములు అవుతున్నారు.

You may also like...

Translate »