ఎన్నికల్లో గెలుపోటములు సహజం

  • దాడులు, దౌర్జన్యాలు మాకు రావు
  • గెలిచిననా, ఓడినా ప్రజల మధ్యే
  • వెన్నుపోటు పొడిచిన వారికీ సమయమే జవాబు చెబుతుంది

ఎన్నికల్లో గెలుపోటములు సహజమే… గెలిచినా…ఓడినా… ప్రజల మధ్యే ఉంటూ ప్రజాసేవ చేసుకుంటూ చటాన్ పల్లి, రాంనగర్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న తనపై నిందలు వేయడం సరికాదని చేగూరి రాజేందర్ రెడ్డి అన్నారు. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికలలో 3,4 వార్డులలో విజయం సాధిస్తాం అనుకున్న స్థానాలను కొంతమంది వెన్నుపోటు దారులతో కోల్పోవాల్సి వచ్చిందని తెలిపారు. తనకు గెలుపోటములు సమానమని ఎన్నికల్లో గెలిచినా, ఓడినా ప్రజా సేవ చేస్తూ ప్రజాజీవనంలో ఆదర్శంగా ఉంటానని అన్నారు. ఓటమి చెందానని కక్ష్యలు, కార్పన్యాలకు పాల్పడే తత్వం తనది కాదని అన్నారు. ఎవరి మనస్తత్వం ఏంటో చటాన్ పల్లి, రాంనగర్ ప్రజలను అడిగితే తెలిసిపోతాయని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 3,4 వార్డులలో కాంగ్రెస్ పార్టీ పరాజయం పొందిందన్న ఆవేశంలో, బాధతో కొంతమంది కార్యకర్తలు, అభిమానులు తన వెంచర్ లోని రోడ్డుకు అడ్డుగా గుంతలను తీశారని తెలిపారు. ఈ విషయం తన దృష్టికి రాగానే ఇది సరికాదని, పదిమంది నడిచే దారిని తవ్వవద్దని వారిని హెచ్చరించా నని అన్నారు. కొంతమంది దురుద్దేశంతో రాజకీయ కక్షతో తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు లేనిపోని ఆరోపణలు చేస్తూ అధికారులకు ఫిర్యాదు చేయడం, సామాజిక మాధ్యమాలలో అసత్య ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. రాజకీయాలు ఎన్నికల అప్పుడే గాని ఎప్పుడు ఉండకూడదని అన్ని పార్టీల నాయకులు తమ వార్డుల అభివృద్ధికి సోదర భావంతో కలిసిమెలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. తనకు రాజకీయాలు, ఎన్నికలు కొత్త కావని కానీ కొంతమంది వెన్నుపోటు దారులు డబ్బుల కోసం తిన్నింటి వాసాలు లెక్కబెడుతున్నారని, ఇది సరికాదని సరైన సమయంలో దేవుడు వారికి తగిన సమాధానం ఇస్తాడని తెలిపారు. తన పేరు ప్రతిష్టలకు భంగం కలిగించేందుకు కొంతమంది దురుద్దేశంతో ఆడుతున్న నాటకమే ప్రస్తుత పరిస్థితులకు నిదర్శనమని, సమయమే వారందరికీ సమాధానం చెబుతుందని చేగూరి రాజేందర్ రెడ్డి అన్నారు.

You may also like...

Translate »