డోర్నకల్ లొ దొరల ఆధిపత్య పార్టీలనను అంతం చేస్తాం

బిఎస్పీ మహిళ జిల్లా కన్వీనర్ గుగులోత్ పార్వతి రమేష్ నాయక్

మరిపెడ:- డోర్నకల్ నియోజకవర్గం లొ దొరల అధిపత్య పార్టీలను అంతం చేసి బహుజనులకు రాజ్యాధికారం తెస్తామని బహుజన్ సమాజ్ పార్టీ మహబూబాబాద్ జిల్లా మహిళ కన్వీనర్ గుగులోత్ పార్వతి రమేష్ నాయక్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ అసెంబ్లీ మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలొ బిఎస్పీ మొదటి పది హామీల గోడపత్రిక ను ఆవిష్కరించారు. అనంతరం ఈసందర్బంగా పార్వతి రమేష్ నాయక్ మాట్లాడుతూ డోర్నకల్ నియోజకవర్గం తర, తరాలుగా దొరలు, వారి బినామీ పాలకులే పరిపాలనలో ఉంటున్నారని అధికారంలో పార్టీలు మారుతున్నాయే తప్ప దొరలు, దొరల బినామీ పాలకులు మారడంలేదని వారి అధిపత్యంలో బహుజనులు బంధీంపబడి ఎలాంటి అభివృద్ధి నోచుకోకుండ తీవ్ర వివక్షకు గురయ్యారని ఇక గడీల పాలనను బిఎస్పీ ఆధ్వర్యంలో బుస్తాపీతం చేస్తామని అన్నారు.బిఎస్పీ ముఖ్యమంత్రి అభ్యర్థి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలొ తెలంగాణ లొ బహుజనులకు రాజ్యాధికారం తెచ్చి అధికారంలొ బహుజనులందరికి వాటా కల్పిస్తామని బహుజనులందరు బిఎస్పీ తొ నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలొ బిఎస్పీ జిల్లా ఇంచార్జ్ లు తేజావత్ అభినాయక్, ఎల్ విజయ్ కాంత్, జిల్లా ఉపాధ్యక్షులు తగరం నాగన్న, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఐతం ఉపేందర్, జిల్లా కార్యదర్శి, డోర్నకల్ అసెంబ్లీ ఇంచార్జ్ ఐనాల పరశురాములు, జిల్లా ఇసి మెంబర్ ఎడ్ల శ్రీను, బిఎస్పీ కార్మిక విభాగం జిల్లా కార్యదర్శి ఏడెల్లి అఖిల్ డోర్నకల్ అసెంబ్లీ అధ్యక్షులు భాషిపంగు మహేందర్,మరిపెడ మండల అధ్యక్ష, కార్యదర్శులు జినక కృష్ణమూర్తి, గుగులోత్ బాసునాయక్,నాయకులు కోర్ని సురేష్, జినక వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »