దాతృత్వానికి నిదర్శనం వాటర్ ప్లాంట్ పునః ప్రారంభం

  • ట్రస్ట్ చైర్మన్ ఏల సుందర్ చేతుల మీదుగా ప్రారంభం చేసిన తాగునీరు

జ్ఞాన తెలంగాణ,దేవరుప్పుల మండల ప్రతినిధి :

దేవరుప్పుల గ్రామ ప్రజల దాహార్తిని తీర్చేందుకు వారికి స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో స్థానిక గ్రామపంచాయతీ వద్ద మూతపడిన వాటర్ ప్లాంట్ సోమవారం సుందర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ ఏల సుందర్ ప్లాంట్‌ను పునఃప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ ప్లాంట్ నిర్వహణ బాధ్యతను సుందర్ చారిటబుల్ ట్రస్ట్ స్వీకరించినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా ట్రస్ట్ ద్వారా పలు సామాజిక, సేవా కార్యక్రమాలు చేపడతామని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, నర్ర కోమలతసోమశేఖర్, వార్డు సభ్యులు, సందీప్, బలరాం,గ్రామ శాఖ అధ్యక్షుడు లొడంగి వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ నాయకులు, యువజన నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

You may also like...

Translate »