మూసిని ఆక్రమిస్తున్న అక్రమార్కులు

జ్ఞాన తెలంగాణ
రాజేంద్రనగర్ ప్రతినిధి

రాజేంద్రనగర్,అత్తాపూర్ డివిజన్ పరిధిలోని మూసీ నది పరివాహక ప్రాంతం అక్రమ వ్యాపారాలకు అడ్డాగా మారిందని విమర్శలు వెళ్ళు వెత్తుతున్నాయి ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్షపు నిద్రను వీడటం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అత్త పూర్ డివిజన్ పరిధిలోని మూసీ నది పరివాహక ప్రాంతంలో లంగర్ హౌస్ బ్రిడ్జి నుంచి అత్తాపూర్ ప్రధాన రహదారికి వెళ్లే ప్రాంతంలో కొన్ని రోజులుగా అక్రమ వ్యాపారాలు దర్జాగా కొనసాగిస్తున్నారు. కొబ్బరి బోండాలు విక్రయించే వ్యాపారాలు సాగుతున్నాయి. అదేవిధంగా కొందరు టీ కొట్టులు, ఇతర వ్యాపారాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి మరో అడుగు ముందుకేసి మూసీ తీరంలో ఏకంగా నర్సరీ ఏర్పాటు చేయడం అధికారుల పనితీరుకు అద్దం పడుతుంది. ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్రను వీడి మూసీ నది తీరంలో నిర్వహిస్తున్న అక్రమ వ్యాపారాలపై కొరఢా ఝలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మూసీనది తీరంలో అక్రమంగా వ్యాపారాలు నిర్వహించడంతో రోడ్డు రోజురోజుకు కుచించుకుపోతుంది. ఈ నేపథ్యంలో నిత్యం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లంగర్ హౌస్ బ్రిడ్జి వైపు నుంచి పిల్లర్ నెంబర్ 120 చేరుకునే ప్రధాన రహదారి అంబియన్స్ ఫార్ట్స్ విల్లాస్ నుంచి ఇరుకుగా మారింది. దీంతో ట్రాఫిక్ రద్దీగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

You may also like...

Translate »