ప్రతి బస్తీ,గల్లీలో సెంట్రల్ లైటింగ్ సిస్టం లైటింగ్ ఉండాలి

సెంట్రల్ లైటింగ్ సిస్టం ను ప్రారంభించిన

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

జ్ఞాన తెలంగాణ, (బాలాపూర్)

ప్రతి బస్తీ,గల్లీలో సెంట్రల్ లైటింగ్ సిస్టం లైటింగ్ ఉండాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జిహెచ్ఎంసిలో విలీనం కాకముందే ప్రతి బస్తీ, ప్రతి గల్లీలో సెంట్రల్ లైటింగ్ సిస్టం లైటింగ్ ఉండాలి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు.మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ చౌరస్తా నుండి నాదర్గుల్ గ్రామం వరకు 2 కోట్ల 50 లక్షలు నిధులతో సెంట్రల్ లైటింగ్ సిస్టం గత ప్రభుత్వ హయాంలో నిధులు కేటాయించి పనులు ప్రారంభించిన సంగతి తెలిసిందే నేడు అందులో భాగంగా బాలాపూర్ చౌరస్తా నుండి బడంగ్పేట్ కమాన్ వరకు 50 లక్షల రూపాయలు నిధులతో సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేశారు. అధికారులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని ప్రాంతాలలో కూడా సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయాలని ప్రతి మెయిన్ రోడ్స్ లో కూడా సెంట్రల్ లైటింగ్ ఉండాలని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోనే కాకుండా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా సెంట్రల్ లైటింగ్ సిస్టం ఉండాలని గతంలో తీసుకున్న నిర్ణయం ఆ పనులు నేడు పూర్తయిన సందర్భంగా నేడు ఇట్టి పనులు ప్రారంభించడం జరిగింది.మిగిలిన పనులు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నుండి నాదర్గుల్ గ్రామం వరకు త్వరితగతిన సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి చేయాలని ఇక్కడ ఉన్నటువంటి అధికారుల్ని ఆదేశించడం జరిగింది.
అంతేకాకుండా పెద్ద చెరువు, మంత్రాల చెరువు పైన కూడా వీలైన తొందర్లో సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణి దేవి కార్పొరేషన్ పరిధిలో లెనిన్ నగర్ నుండి బడంగపేట్ కమాన్ వరకు 50 లక్షల రూపయలతో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను మాజీమంత్రి మహేశ్వరం నియోజకవర్గ శాసన సభ్యురాలు సబితా ఇంద్రరెడ్డి, యం.యల్.సి సురభి వాణిదేవి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మీర్‌పేట్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ యం.దుర్గా దీప్ లాల్ చౌహాన్,డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి,ఫ్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి, కార్పోరేటర్లు సిద్ధాల లావణ్య బీరప్ప,సిద్ధాల లార్డ్స బీరప్ప, అనిల్ కుమార్ యాదవ్, సౌందర్య విజయ్,మాధరి సురేఖ రమేష్,రేఖా లక్ష్మణ్ ముదిరాజ్,సిద్ధాల పద్మ అంజయ్య కో-ఆప్షన్ సభ్యులు రజాక్,స్నేహలత,నగరపాలక సంస్థ అధికారులు కమీషనర్ శ్రీ బి.చంద్రశేఖర్, డి.ఈ.ఈ వెంకన్న,యస్.ఐ రమేష్, మీర్పేట్ బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ అర్కల కామేష్ రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ మహిళా ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి ,వర్కింగ్ ప్రెసిడెంట్ దిండు భూపేష్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు శ్రీను నాయక్, సిరూర్ బాల్ రాజ్,పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సిదల భారత్ నాయకులు, మహిళా అద్యక్షురాలు సునీత బాల్ రాజ్, నాయకురాళ్లు పంతంగి మాధవి,లతా శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »