జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి:

జ్ఞాన తెలంగాణ భూపాలపల్లి ప్రతినిధి:

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులు శ్రీ పి. నారాయణ బాబు జిల్లా కోర్టు ప్రాంగణంలో పోలీసులచే గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ సివిల్ జడ్జి గౌరవనీయులు శ్రీ కే. జయరాం రెడ్డి గారు, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి గౌరవనీయులు శ్రీ ఎన్. రామచంద్రా రావు గారు, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి జి. అఖిల గారు, ఏవో శ్రీమతి అనితవాని గారు, అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ కూనూరి సురేష్ గారు, ప్రధాన కార్యదర్శి బల్లా మహేందర్ గారు, కోర్టు సిబ్బంది, పోలీసు సిబ్బంది, న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »