రామగుండం పురపోరులో 14వ డివిజన్ దమ్మున్న నాయకుడు

  • భగవత్ శంకర్ నాయక్

జ్ఞాన తెలంగాణ,రామగుండం అసెంబ్లీ నియోజకవర్గ ప్రతినిది:

రామగుండం పురపాలక ఎన్నికల్లో 14వ డివిజన్ నుంచి రెండవసారి బరిలోకి దిగుతున్న కార్పొరేటర్ భగవత్ శంకర్ నాయక్ దమ్మున్న నాయకుడిగా ప్రచారంలో ముందంజలో ఉన్నారు. 1988 నుంచే ప్రజా ఉద్యమాల్లో క్రియాశీలంగా పనిచేస్తూ ధర్మారం మండల యూత్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, మార్కెట్ కమిటీ చైర్మన్‌గా, మేడారం కాన్స్టిట్యూషన్ ఇన్‌చార్జ్‌గా కీలక బాధ్యతలు నిర్వహించారు. మొదటిసారి కార్పొరేటర్‌గా గెలిచిన తరువాత కోట్ల రూపాయల నిధులతో డివిజన్‌ను అభివృద్ధి చేసిన నేతగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
ఇంటి గడప దాటగానే సీసీ రోడ్డుపైనే అడుగు పడేలా మౌలిక వసతులు కల్పించడమే తన లక్ష్యమని ఆయన పేర్కొంటున్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు ప్రతిక్షణం అందుబాటులో ఉండి సేవలందించిన నాయకుడిగా ప్రజల మనసుల్లో స్థానం సంపాదించారు. క్రీడాకారులకు దుస్తుల పంపిణీ, పోలీస్, ఆర్మీ శిక్షణ పొందుతున్న యువతకు పౌష్టికాహారం అందించడం ద్వారా యువతకు అండగా నిలిచారు.
ఎస్టీ వెల్ఫేర్‌కు సంబంధించిన ఉద్యోగాల కోసం హైకోర్టు వరకు పోరాటం చేయడం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాల నిర్వహణతో ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. రెండవసారి కాంగ్రెస్ పార్టీ నుంచి బీ ఫామ్ పొందిన అనంతరం డివిజన్ ఆధునీకరణ, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, ప్రతి ఇంటికి మంచినీరు, వీధిదీపాలు, రేషన్ కార్డులు, ప్రభుత్వ పథకాలు, ఇందిరమ్మ ఇళ్లు వంటి హామీలతో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. డివిజన్ ప్రజల సహకారంతో భారీ మెజార్టీతో గెలుపే లక్ష్యంగా భగవత్ శంకర్ నాయక్ పురపోరులో దూసుకుపోతున్నారు.

You may also like...

Translate »