రేపే పదో తరగతి పరీక్ష ఫలితాలు

హైదరాబాద్‌: ఏప్రిల్ 29
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల ఫలితాల విడు దలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటల కు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు.

విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ https://results.bsetelangana.org/ చూసుకోవచ్చు.

ఈ ఏడాది మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పదో తరగతి పరీక్షలను నిర్వహిం చిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యా ర్థులు హాజరయ్యారు.

వీరిలో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియను ఏప్రిల్ 13 నాటికి పూర్తిచేశారు

You may also like...

Translate »