తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల…!

తెలంగాణ ఎన్నిక నగార మోగింది. ఎన్నికల తేదీలను ప్రకటించారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. తెలంగాణలోని అన్ని స్థానాలకు ఒకే విడతలో నవంబరు 30న పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. మిగిలిన నాలుగు రాష్ట్రాలతో కలిపి డిసెంబరు 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నవంబరు 3న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు.
నోటిఫికేషన్: నవంబర్ 3 2023.
నామినేషన్ల స్వీకరణ: నవంబర్ 10 2023.
నామినేషన్ల ఉపసంహరణ: నవంబర్ 15 2023.
నామినేషన్ల పరిశీలన నవంబర్ 13 2023.
పోలింగ్ తేదీ: నవంబర్ 30 2023.
ఎన్నికల కౌంటింగ్: డిసెంబర్ 3 2023.
