అక్రమ ఇసుక డంపు పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు.

అక్రమ ఇసుక డంపు పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు.
జ్ఞాన తెలంగాణ సిద్దిపేట జిల్లా ప్రతినిది:
మద్దూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాలపల్లి గ్రామ శివారులో ఇసుక డంపులు ఉన్నాయని సమాచారం పై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు సిబ్బంది. మద్దూర్ పోలీసులు వెళ్లి తనిఖీలు నిర్వహించగా గ్రామ శివారులో దాదాపు 150 టన్నుల ఇసుక డంపును ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు డంపుచేసిన ఇసుకను సీజ్ చేయడం జరిగిందన్నారు. మద్దూర్ పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటారని తెలిపారు.
ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ, ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక, పిడిఎస్ రైస్, అక్రమ రవాణా చేసిన పేకాట, జూదం, గంజాయి ఇతర మత్తు పదార్థాలు విక్రయించిన కలిగి ఉన్న చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటు సమాచారం ఉంటే వెంటనే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్, 8712667445. ఆఫీసర్స్, 8712667447. 8712667446, నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.