స్నేహితుల కుటుంబాలకు రూ.22వేల ఆర్థిక సహాయం
స్నేహితుల కుటుంబాలకు రూ.22వేల ఆర్థిక సహాయం
జ్ఞాన తెల్లంగాణ, కేసముద్రం:

కేసముద్రం మండలం కోరుకొండ పల్లి గ్రామానికి చెందిన కాసాని రాధిక ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందారు. ఇదే గ్రామానికి చెందిన దాసరి రాధిక తండ్రి ఉప్పలయ్య అనారోగ్యంతో మృతి చెందారు.
కాసాని రాధిక, దాసరి రాధిక లు కేసముద్రం విలేజ్ జెడ్పీ హైస్కూల్ లో 2007-–08లో టెన్త్ బ్యాచ్ కు చెందినవారు. ఈ రెండు కుటుంబాలు కష్టకాలంలో ఉండడంతో వారికి సహాయం అందించేందుకు క్లాస్ మెట్లు విరాళాలను సేకరించారు.
ఈ మేరకు ఆదివారం ఒకొక్క కుటుంబానికి రూ.11,016 చొప్పున రూ.22,032లను ఆ బ్యాచ్ కు చెందిన మిత్రులు దాసరి అశోక్, నాగెళ్ళి సుధీర్ లు అందజేశారు. స్నేహితుల కోసం సహాయం చేయడానికి పలువురు గ్రామస్తులు అభినందించారు.