విద్యార్థులు నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

డిసిసి అధికార ప్రతినిధి
గూడూరు శ్రీనివాస్ రెడ్డి

ఎస్సీ సెల్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు – జగన్

బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ

జ్ఞాన తెలంగాణ, (కడ్తాల్)

నల్గొండ,వరంగల్,ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపుతో కడ్తాల్ మండల కేంద్రంలో కడ్తాల్ మండల అధ్యక్షుడు బిచ్యా నాయక్ ఆధ్వర్యంలో టపాకాయలు పెలుస్తూ సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా డిసిసి అధికార ప్రతినిధి ఎంపీటీసీ ఫారం జిల్లా గౌరవ అధ్యక్షులు గూడూరు శ్రీనివాస్ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నరసింహ మరియు మండల అధ్యక్షుడు బిచ్యా నాయక్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తీన్మార్ మల్లన్న గెలవడంతో నిరుద్యోగుల సమస్యలన్ని పరిష్కారం అవుతాయని తెలిపారు.ప్రతి పట్టభద్రుడు ఆలోచించి ఓట్లరూపంలో ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కృషి చేశారన్నారు.విద్యార్థులు మరియు నిరుద్యోగుల సమస్యల కోసం చట్టసభలో తీన్మార్ మల్లన్న గళం విప్పుతారని అన్నారు.తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించిన నల్గొండ,వరంగల్, ఖమ్మం జిల్లాల పట్ట భద్రులందరికీ ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు జాంగిర్ బాబా, సీనియర్ నాయకులు సేవాదళ్ లక్ష్మయ్య,ఉపద్యక్ష్యుడు మల్లేష్ గౌడ్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు అశోక్,టౌన్ వర్కింగ్ అధ్యక్షుడు రాంచందర్ నాయక్,నాయకులు భాస్కర్ రెడ్డి,జంగీర్ అలి,సత్యం యాదవ్,మల్లయ్య,క్యామ శేఖర్,శంకర్,బాలరాజు,జగన్, చెన్నయ్య,రామ్,గుద రాములు,శ్రీశైలం,క్యామ రాజేష్,టౌన్ యూత్ అధ్యక్షుడు భానుకిరణ్,ఎర్రోళ్ల శ్రీకాంత్,ఇమ్రాన్ బాబా,బోసు రవి,శ్రీకాంత్,విజయ్, రామకృష్ణ,రంగా,లక్ష్మణ్, మహేష్,శ్రీను,చందు తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »