బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య

https://youtube.com/shorts/QdCalxkxYMk?si=gInLJxvEM1ir3ZZs

సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ మండల కేంద్రంలోని బిసి గురుకుల పాఠశాలలో విద్యార్ది ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం రాత్రి జరిగింది. వివరాల ప్రకారం నల్లగొండ జిల్లా నిడమానూరు మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన ఆలకుంట్ల వెంకన్న- జయలక్ష్మీ దంపతుల కుమారుడు రాకేష్ మహాత్మా జ్యోతిభా ఫూలే బిసి సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. పాఠశాలలో టాయిలెట్స్ ఎదురుగా ఉన్న రేకుల షెడ్డు కు ఉరి వేసుకుని చనిపోయినట్టు గుర్తించిన తోటి విద్యార్దులు ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చారు. విద్యార్థి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

You may also like...

Translate »