గుర్తింపు లేని ప్రైవేట్ స్కూల్స్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలి.

జ్ఞాన తెలంగాణ, న్యూస్.
నారాయణఖేడ్:

ప్రవేట్ కార్పోరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజులను అరికట్టాలి.

నారాయణఖేడ్ పట్టణంలోని పల్లవి స్కూల్ దగ్గర ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది.

సిబిఎస్ఇ పేరుతోనే తల్లిదండ్రులను మోసం చేస్తున్న యజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని .

ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎర్రోళ్ల మహేష్ డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎర్రోళ్ల మహేష్ మాట్లాడుతూ నారాయణఖేడ్ పట్టణంలోని పల్లవి స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది.

పల్లవి స్కూల్ సిబిఎస్ పేరుతోని అడ్మిషన్లు తీసుకుంటూ విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్న పల్లవి స్కూల్ యాజమాన్యం పైన ఉన్నంత అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో దాదాపు రెండు గంటల పాటు ధర్నా చేయడం జరిగింది.

ఎంఈఓ వచ్చినప్పటికీ కూడా ప్రవేట్ స్కూల్ యజమాన్యం కు తొత్తుగా మారినట్టు ఎంఈఓ వైఖరిగా ఉంది అడ్మిషన్లు తీసుకుంటున్నారని కూడా ఎంక్వయిరీ కూడా చేయలేకుండా అక్కడి నుండి వెళ్లిపోయినటువంటి ఎంఈఓ జిల్లా అధికారులు తక్షణమే స్పందించి ఎంఈఓ పైన అలాగే స్కూల్ పైన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ గా కోరుతున్నాం లేనియెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు.పవన్. చంద్రశేఖర్ .శ్రీకాంత్. గణేష్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »