కేయూ రిజిస్టర్ రామ్ చందర్ గారిని కలిసిన SSF రాష్ట్ర అధ్యక్షుడు బాన్సువాడ వేదాంత్ మౌర్య

కాకతీయ యూనివర్సిటీ రిజిస్టర్ ఛాంబర్ లో రిజిస్టర్ రామ్ చందర్ గారిని కలిసి మర్యాదపూర్వకంగా శాలువాతో సన్మానించిన సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వేదాంత్ మౌర్య తదనంతరం, కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి పలు విద్యార్థి సమస్యల పైన మాట్లాడుతూ ప్రభుత్వం నుండి రావలసిన స్కాలర్ షిప్స్ ఫీజు రియాంబర్స్ మెంట్ విషయంలో కాలేజ్ యాజమాన్యాలు హాల్ టికెట్లు ఇవ్వకపోవడం విద్యార్థులని స్కాలర్షిప్ వచ్చినప్పుడు మీ డబ్బులు మీకు రిటర్న్ ఇస్తాము కానీ ఇప్పుడు మాత్రం మీరు ఫీజు కట్టాల్సిందే అని చెప్పేసి విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నటువంటి విషయాలను కాకతీయ యూనివర్సిటీ రిజిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది రిజిస్టర్ గారు సానుకూలంగా స్పందిస్తూ విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము అలాగే కాలేజీ యజమానులతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మద్దెల సుధీర్ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు రానా ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »