క్లాసు రూంలో ఉపాధ్యాయులు సెల్ ఫోన్ వాడొద్దు?


క్లాసు రూంలో ఉపాధ్యాయులు సెల్ ఫోన్ వాడొద్దు?

హైదరాబాద్: సెప్టెంబర్ 13
తరగతి గదిలో సెల్‌ఫోన్‌ మాట్లాడే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు.
ఈ మేరకు ఉన్నతాధి కారులు గురువారం సాయంత్రమే సర్క్యూలర్‌ ను జారీ చేశారు. ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో అమలు పరచాలని ఆదేశించారు.
తరగతి గదుల్లో కొందరు ఉపాధ్యాయులు సెల్‌ఫోన్‌ మాట్లాడుతున్నట్టు సమాచారం ఉందని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. దీనిని నివారించడం కోసం సర్క్యూలర్‌ను జారీ చేసినట్టు చెప్పారు.
దీని ప్రకారం ఇక నుంచి తరగతి గదుల్లో ఉపాధ్యా యులు సెల్‌ఫోన్‌ మాట్లా డడం నిషేధం. సీసీఏ మార్గదర్శకాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నట్టు అధికారులు తమ సర్క్యూలర్‌లో పేర్కొన్నారు.
రాష్ట్రంలోని ఉపాధ్యాయు లందరూ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని కోరారు..

You may also like...

Translate »