ప్రశాంతంగా ముగిసిన ఏడవ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష
ప్రశాంతంగా ముగిసిన ఏడవ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష
జ్ఞాన తెలంగాణ, కొండాపూర్:

సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ మండలంలోని గిర్మాపూర్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఏడవ తరగతి ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి. కళాశాల ప్రిన్సిపల్ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారంగా 402 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావలసి ఉండగా..
అందులో 362 మంది విద్యార్థులు హాజరైనట్టు మిగతా 40 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ప్రైవేటు విద్యాసంస్థల కంటే గురుకుల విద్యాలయాల్లో నాణ్యమైన విద్య కోసం విద్యార్థుల తల్లిదండ్రులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు.
పరీక్షల అనంతరం ఫలితాలు వచ్చి సీటు సాధించిన విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తు కి పునాదులు వేసుకొని ముందుకు సాగాలని కోరారు.
పరీక్ష ఫలితాలలో సీటు సాధించలేని విద్యార్థులు నిరాశ పడవద్దని జీవితంలో మంచి గమ్యాన్ని పెట్టుకొని ముందుకు సాగాలని ఆయన ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు.