రంగల్ ప్రజల ఆత్మగౌరవ పోరాటం

రంగల్ ప్రజల ఆత్మగౌరవ పోరాటం
జ్ఞాన తెలంగాణ వరంగల్ డిసెంబర్ 31:
వరంగల్ బస్టాండ్ ఆవరణం లో అభివృద్ధి పేరుతో వరంగల్ బస్టాండ్ అభివృద్ధి పనులు వెంటనే చేపట్టాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎన్నికల మ్యానిఫెస్టో లో వరంగల్ బస్టాండును ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని హామీ ఇచ్చి ఇప్పటివరకు ఎటువంటి నిర్మాణ కార్యక్రమాలు చేపట్టకుండా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా మంత్రి కొండ సురేఖ అలసత్వం వహిస్తున్నారని జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని మంత్రిని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జడ సతీష్. జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి. సీనియర్ నాయకులు మాదిరెడ్డి దేవేందర్ రెడ్డి. రాష్ట్ర నాయకులు,జిల్లా ఉపాధ్యక్షులు పట్టాపురం ఏకాంతం గౌడ్ .వర్ధన్నపేట పట్టణ అధ్యక్షులు పెద్దూరి రాజ్ కుమార్. సీనియర్ నాయకులు బోయినపల్లి దేవేందర్ రావు. జిల్లా నాయకులు మైస రాము. మల్లెపాక అనిల్. బర్ల నవీన్ మరియు తదితరులు పాల్గొన్నారు.