సాలూర,బోధన్ మండలాల్లో సైన్స్ సెమినార్.

సాలూర,బోధన్ మండలాల్లో సైన్స్ సెమినార్.

జ్ఞాన తెలంగాణ – బోధన్ : సాలూర జిల్లా పరిషత్ హైస్కూల్ లో, బోధన్ ఉప విద్యాధికారి కార్యాలయంలో గురువారం మండల స్థాయి సైన్స్ సెమినార్ ను నిర్వహించారు. సైన్స్ సెమినార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ విధానంపై నిర్వహించారు.ఈ కార్యక్రమంలో హూన్స, సాలూర హైస్కూల్ విద్యార్థులు ఈ సైన్స్ సెమినార్ లో పాల్గొన్నారు. ఈ సైన్స్ సెమినార్ పోటీలలో విజేతలయిన విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలలో పాల్గొంటారని సాలూర ఎంఈఓ రాజి మంజూష తెలిపారు. ఈ పోటీలలో హున్సా హైస్కూల్ 8వ తరగతి విద్యార్థిని వైష్ణవి జిల్లా స్థాయికి ఎటపికయినట్లు ఎంఈఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల సైన్స్ టీచర్లు పాల్గొన్నారు.అలాగే బోధన్ మండల స్థాయి పోటీలను ఉప విద్యాధికారి కార్యాలయంలో నిర్వహించారు. బోధన్ మండల స్థాయి సైన్స్ సెమినార్ లో భాగంగా “ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , పొటెన్షియల్స్ అండ్ కన్సర్న్స్” అనే అంశం పై పోటీలు నిర్వహించారు.ఈ పోటీలలో బోధన్ విజయసాయి హైస్కూల్ కి చెందిన బుష్రా బుతూల్ అనే విద్యార్థిని ప్రథమ స్థానం సాధించి జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ కు ఎంపికైందని బోధన్ ఎంఈఓ నాగయ్య తెలిపారు. జిల్లా స్థాయికి ఎంపికయిన విద్యార్థినికి ఎంఈఓ నాగయ్య అభినందించారు.

You may also like...

Translate »