అలుపెరుగని అక్షర యోధుడు రామోజీరావు..

టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పర్కాల సమ్మయ్య గౌడ్, వేముల మహేందర్ గౌడ్

ఈనాడు చైర్మన్ రామోజీకి నివాళులు

అక్షర యాత్రికులకు ఆదర్శమని ప్రశంస

జ్ఞాన తెలంగాణ, మొగుళ్ళపల్లి సాధారణ వ్యక్తిగా జీవితాన్ని మొదలుపెట్టి అక్షర యోధుడిగా అలుపెరుగని యాత్ర చేసి చరిత్ర సృష్టించిన యోధుడు ఈనాడు గ్రూప్స్ చైర్మన్ రామోజీరావు..అని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ (టిడబ్ల్యూజేఎఫ్) జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పర్కాల సమ్మయ్య గౌడ్, వేముల మహేందర్ గౌడ్ కొనియాడారు. శనివారం వారు విలేకరులతో మాట్లాడారు. దివంగతులైన రామోజీరావుకు వారు ఘన నివాళులర్పించారు. అనంతరం ఈ సందర్భంగా రామోజీ రావు గురించి మాట్లాడారు. 70వ దశకంలో ఒక ఆదర్శంతో పత్రికను స్థాపించిన రామోజీరావు ఎన్ని విమర్శలు వచ్చినా..ఎదుర్కొంటూ తన లక్ష్యాన్ని వీడకుండా పత్రికను ఆదర్శవంతంగా ముందుకు నడిపారని కొనియాడారు.

కొందరు రాజకీయ నాయకులకు నచ్చిన, నచ్చకపోయినా ఆయన తన పంధా వీడకుండా ముందుకు సాగరన్నారు. ఈనాడుతో పాటు ఈటీవీ గ్రూపుల సంస్థ చైర్మన్ గా, మార్గదర్శి, ప్రియా పచ్చళ్ళు వంటివి వెలుగులోకి తెచ్చిన వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారని ప్రశంసించారు.

అలాంటి పత్రిక దిగ్గజం ఈ రోజున కన్నుమూయడం అత్యంత విషాదకరమని వారు పేర్కొన్నారు. ఆ భగవంతుడు రామోజీ కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని, ఎక్కడ ఉన్న ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాటూరి రవీందర్ గౌడ్, నియోజకవర్గ అధ్యక్షులు దుర్గం సురేష్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మంగళపల్లి శ్రీనివాస్, ముగ్గుల్లపల్లి మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నిమ్మల భద్రయ్య, మురహరి మనోజ్, యూనియన్ నాయకులు వేముల కిరణ్ గౌడ్, తంగళ్ళపల్లి హరీష్, రాము, చెక్క శ్రీధర్, బుర్ర రమేష్ తదితరులున్నారు.

You may also like...

Translate »