స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
జ్ఞానతెలంగాణ చిట్యాల, జూన్ 5:
చిట్యాల మండల కేంద్రం శివారు వెంకట్రావు పల్లి (సి) గ్రామానికి చెందిన ముడతనపల్లి లక్ష్మి ఇటీవల విద్యుత్ షాకు కు గురై మృతి చెందారు. మృతురాలి కుమారుడు ముడతనపల్లి సదానందం యొక్క టెన్త్ 1997 -1998 బ్యాచ్ క్లాస్మేట్స్ మిత్రులు బుర్ర శ్రీధర్ పువ్వాటి హరికృష్ణ ఆధ్వర్యంలో మృతురాలి దశదినకర్మ సందర్భంగా బుధవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి రూ. 15 వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా క్లాస్మేట్ మిత్రులు మాట్లాడుతూ తమ క్లాస్మేట్ మిత్రులలో ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా తమ వంతు సహాయంగా బాధిత కుటుంబాలకు అండగా ఉంటూ ఆర్థికంగా ఆదుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా ఆర్థిక సాయం అందించిన మిత్ర బృందాన్ని గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో స్నేహ బృందం నేపాలి వేణుసింగ్ బుర్ర సాంబశివుడు మారపల్లి మల్లేష్, ఎల్ రమేష్, రాజనర్సు,యుగంధర్ మడికొండ శ్రీనివాస్, ఇజ్జిగిరి రాజు, సదానందం, గుర్రం రాజమౌళి తదితరులు ఉన్నారు.