రేపు సామూహిక ఆత్మార్పణకు సిద్ధం- కె.యూ జె.ఏ.సి

ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న కాకతీయ యూనివర్సిటీ జాయింట్ ఆక్షన్ కమిటీ నాయకులు

K.U విధ్యార్థి జె.ఏ.సి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్. పి.హెచ్.డి అడ్మిషన్ లలో అవకతవకలు ఉన్నాయని వాటిని ఆధారాలతో సహా మేము నిరూపిస్తామని వాటిపై 46 పేజీల బుక్ విడుదల చేశామన్నారు.
మేము నిరూపించిన వాటిపైన బహిరంగ చర్చకు వి.సి,రిజిస్ట్రార్ లు వారి డీన్స్ బహిరంగ చర్చకు సిద్ధమా..అని వారు సవాలు విసిరారు.
తప్పు చేయనపుడు రాకుండా ఎందుకు మౌనంగా ఉంటున్నారన్నారు ,ఎలాంటి తప్పు చేయనపుడు భయపడాల్సిన అవసరం ఏముందన్నారు,వ్యాయమ విద్యా, న్యాయ,రాజనీతి శాస్త్రంలో,కంప్యూటర్ సైన్స్, ఫార్మసీ విభాగాలలో అవకతవకలు జరిగాయని
బహిరంగ చర్చలో మా విద్యార్థులది తప్పు అయితే ముక్కు నేలకు రాసి దీక్ష విరమించుకుని యూనివర్సిటీ విడిచి వెళ్తాం అని తెలిపారు
ఒకవేళ తప్పు మీది అయితే (V.C, Registrar, Dean’s) మీ పదవులకు రాజీనామా చేసి యూనివర్సిటీ విడిచి వెళ్తారా అని ప్రశ్నించారు.
రేపు ఉదయం 11గంటల లోపు వి.సి,రిజిస్ట్రార్ డీన్స్ వారి దగ్గర ఉన్న ఆధారాలతో దూరవిద్య ప్రాంగణంలోని దీక్ష స్థలి ప్రాంతానికి రాకపోతే 12గంటల వరకు విద్యార్థులందరూ రేపు గాంధీ జయంతి సందర్భంగా హన్మకొండ పబ్లిక్ గార్డెన్ లోని గాంధీ విగ్రహం ముందు సామూహిక ఆత్మార్పణం చేసుకుంటామని హెచ్చరించారు.

You may also like...

Translate »