పాలేరు ప్రజలు మెంత తుఫాన్ కి అప్రమత్తంగా ఉండాలి : మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి

జ్ఞాన తెలంగాణ,ఖమ్మం జిల్లా,ప్రతినిధి,అక్టోబర్ 29:
పాలేరు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. “మెంత” తుఫాను ప్రభావం మన ప్రాంతంపై తీవ్రంగా ఉండబోతున్నందున, అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దు.మరి ముఖ్యంగా పాలేరు రిజర్వాయర్ & మున్నేరు నది చుట్టుపక్కల గ్రామాలు అప్రమత్తతో ఉండాలి. రైతులు తమ ధాన్యాన్ని తడవకుండా చూసుకోవాలి అని విజ్ఞప్తి చేశారు అలాగే అధికారులు తుఫానుకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
మనమందరం కలిసికట్టుగా ఉంటే ఈ విపత్తును సులభంగా ఎదుర్కోవచ్చు.
