కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వమే’

  • బీజేపీ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు ఎండీ నయీమ్
    జ్ఞాన తెలంగాణ,శంషాబాద్:
    కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వమే వస్తుందని రంగా రెడ్డి జిల్లా
    బీజేపీ మైనారిటీ నాయకుడు మొహమ్మద్ నయీమ్(అడ్వకేట్ )అన్నారు,. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నయీమ్ మాట్లాడుతూ పదేళ్లు రాష్ట్రాన్ని పాలించి ప్రజలను దోచుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరిం చారని, అదే విధంగా ఆరు నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి ఉత్తుత్తి వాగ్ధా నాలు చేసి ఆరు గ్యారెంటీలని ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మోడీ పాలన్లో దేశం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి ప్రపంచం లోని అభివృద్ధి చెందిన అగ్రదేశాల సరసన నిలిచిందన్నారు,పార్ల మెంట్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని ఆదరించి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి భారీ మెజారిటీ తొ విజయం సాధిస్తారన్నారు.

You may also like...

Translate »