పోచంపల్లి బ్యాంకుకు జాతీయ అవార్డులు

పోచంపల్లి బ్యాంకుకు జాతీయ అవార్డులు
బెస్ట్ ఎన్ పి ఏ ,బెస్ట్ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు
భారతరత్న సహాకారి సమ్మాన్ చేతులు మీదుగా అవార్డు అందుకున్న
పోచంపల్లి బ్యాంకు సీఈవో సీత శ్రీనివాస్
పోచంపల్లి బ్యాంకు కు జాతీయ అవార్డులు రావడం సంతోషం
బ్యాంకు చైర్మన్ కర్నాటి వెంకట బాల సుబ్రమణ్యం
జ్ఞాన తెలంగాణ, (భూదాన్ పోచంపల్లి)
పోచంపల్లి బ్యాంకు కు జాతీయ అవార్డులు రావడం సంతోషం
గా ఉందని పోచంపల్లి బ్యాంకు చైర్మన్ కర్నాటి వెంకట బాల సుబ్రమణ్యం అన్నారు. పోచంపల్లి కో -పరేటివ్ బ్యాంకుకు రెండు జాతీయ అవార్డులు రావడం జరిగింది.
భారతరత్న సహాకారి సమ్మాన్ ముంబాయి వారి ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన జాతీయ అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా, తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలానికి చెందిన పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకుకు 2 జాతీయ అవార్డులు రావడం జరిగింది. వాటిలో మొదటి అవార్డు బెస్ట్ ఎన్ పి ఎ, రెండవది కో- ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఇన్ తెలంగాణ ఈ అవార్డులను భారతరత్న సహాకారి సమ్మాన్ గారి చేతుల మీదుగా పోచంపల్లి బ్యాంక్ సీఈవో సీత శ్రీనివాస్ అందుకోవడం జరిగింది.ఈ అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా బ్యాంకు ఛైర్మన్ కర్నాటి వెంకట బాల సుబ్రమణ్యం మాట్లాడుతూ రెండు జాతీయ అవార్డులు రావడం మామూలు విషయం కాదని అందరం సమిష్టిగా కలిసి పనిచేయడం వల్ల సాధ్యం అయ్యిందని ఆయన అన్నారు.
అవార్డు రావడానికి కృషి చేసిన
బ్యాంకు సీఈవో సిబ్బంది బ్యాంక్ వైస్ చైర్మన్ సూరపల్లి రమేష్,బ్యాంకు డైరెక్టర్లు, సిబ్బందికి బ్యాంకు చైర్మన్ కర్నాటి వెంకట బాల సుబ్రహ్మణ్యం కృతజ్ఞతలు తెలిపారు. పోచంపల్లి కో- ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా విస్తరించి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సి.ఇ.ఓ సీత శ్రీనివాస్,వైస్ చైర్మన్ సూరేపల్లి రమేష్, డైరెక్టర్లు- సీత దామోదర్, భోగ విజయ్ ప్రమార్, చిక్క కృష్ణ, పున్న లక్ష్మీనారాయణ,
కొండ మడుగు ఎల్లస్వామి, కడపేరు కవిత, పిల్లలమర్రి) అర్చన,రాపోణ వేణు,చిట్టు భాస్కర్, బ్యాంక్ సీనియర్ మేనేజర్ రాచకొండ మధుసుధన్ బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.