పెద్దమందడి మండలంలోని వీరాయ్య పల్లి గ్రామంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్విహిస్తున్న వేంకటేశ్వర స్వామి ఉత్సవాల్లో మంగళవారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పాల్గోని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఉత్సవాలలో పాల్గొనేందుకు గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు డప్పుల వాయీద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. అలాగే ప్రత్యేక పూజలు అనంతరం గ్రామస్తులు ఎమ్మెల్యేను శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి, పెద్దమందడి మండలాల నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.