కిష్టారం గ్రామం లో ఇల్లు నిర్మాణ పూజ కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్

కిష్టారం గ్రామం లో ఇల్లు నిర్మాణ పూజ కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్
జ్ఞాన తెలంగాణ న్యూస్ సత్తుపల్లి:సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామం లో సింగరేణి బాంబ్ బ్లాస్టింగ్ వల్ల ఇల్లు నష్టపోయినా SC, BC కాలనీ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో సత్తుపల్లి సింగరేణి సహకారం తో విజయదశమి నాడు ఇల్లు నిర్మాణ భూమి పూజ నిర్వహించిన సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ , ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలు గా పరిష్కారం కానీ కిష్టారం గ్రామ సింగరేణి బాధితులు సమస్యలు ను మా వంతు పూర్తి బాధ్యత గా తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం తో , జిల్లా మంత్రివర్యులు ను కలిసి సింగరేణి సీఎండీ తో, కలెక్టర్ తో , GM తో పలు మార్లు మాట్లాడగా, ప్రజలు సమస్యలు తెలుసుకొని ఇల్లు నిర్మాణనికి ముందుకు వచ్చినందుకు సింగరేణి వారికీ కృతజ్ఞతలు తెలియజేసారు కిష్టారం గ్రామం లో SC, BC కాలనీ ప్రజలకు దసరా కానుకగా ఇల్లు నిర్మాణ భూమి పూజ కార్యక్రమం చేశారు నిర్మాణ పనులు ఎటువంటి నాణ్యత లోపం లేకుండా కిష్టారం గ్రామ కమిటీ ద్వారా ఇల్లు నిర్మాణం పూర్తి చెయ్యటం జరుగుతుంది అని తెలియజేసారు.ఈ కార్యక్రమం లో సింగరేణి మేనేజర్ సింగరేణి ప్రాజెక్ట్ ఆఫీసర్ లు, సత్తుపల్లి AMC చైర్మన్ దోమ ఆనంద్,కిష్టారం గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.